Honeymoon Express | కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్, చైతన్యరావు కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ (Honeymoon Express). బాల రాజశేఖరుని రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. జూన్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం రెండు నెలల తర్వాత ఓటీటీ మూవీ లవర్స్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి (ఆగస్టు 27న)ఎంట్రీ ఇచ్చింది.
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, పెండ్లి, విడాకుల కాన్సెప్ట్‌తో యూత్‌ను ఆకట్టుకునేలా ఇంప్రెసివ్‌గా సాగుతూ ఓటీటీ లవర్స్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తూ.. ట్రెండింగ్‌లో నిలుస్తోంది. మీరు ఈ సినిమాను థియేటర్లో మిస్సయ్యారా..? అయితే ఇంకేంటి ఓటీటీలో ఓ లుక్కేయండి మరి.
ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యూఎస్ఏ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. కళ్యాణిమాలిక్ సంగీతం అందించారు.
#HoneymoonExpress (2024) Telugu Movie Now Streaming Streaming On @PrimeVideoIN#BalaRajasekharuni#ChaitanyaRaoMadadi#HebahPatel#Ott #OTT #OttMovies #OttUpdates #OttNews #OttTelugu pic.twitter.com/RJVdHraIer
— Movie Info Tamil 🎥📽️ (@movieinfotamil) August 27, 2024
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!