Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి టైటిల్ రోల్లో నటిస్తోన్న కూలీ (Coolie). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ టీజర్లో బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్ ఛైన్లతో సూపర్ స్టార్ చేస్తున్న స్టైలిష్ ఫైట్ సన్నివేశాలు సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడన్న వార్త ఒకటి బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం అమీర్‌ఖాన్‌తో చర్చలు కూడా జరుపుతున్నాడని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇండియా బిగ్గెస్ట్ స్లార్ యాక్టర్లను ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చన్నమాట. మరి దీనిపై తలైవా టీం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
కూలీ మూడో షెడ్యూల్ ఇటీవలే బీచ్ సిటీ వైజాగ్ సిటీలో షురూ అయినట్టు వార్తలు వచ్చాయి. సుమారు 40 రోజులపాటు ఈ చిత్రీకరణ కొనసాగించనున్నట్టు టాక్. ఈ షెడ్యూల్లో రజినీకాంత్, శృతిహాసన్‌తోపాటు పలువురు నటీనటులపై వచ్చే సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ సత్యరాజ్ కీ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టులో మహేంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?