Allu Arjun | తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ అల్లు అర్జున్ (Allu Arjun) వేసిన క్వాష్ పిటిషన్‌పై (quash petition) హైకోర్టులో (High Court) వాదనలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాట ఘటనలో తన క్లైంట్కు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. బెనిఫిట్ షోలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే ఇచ్చామని తెలిపారు. దీంతో అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారా..? అని కోర్టు ప్రశ్నించింది. బందోబస్తు కోసం డిసెంబర్ 2నే లేఖ రాసినట్లు అడ్వొకేట్ తెలిపారు. ఈమేరకు చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని బన్ని తరఫు న్యాయవాది కోర్టుకు అందజేశారు.
మరోవైపు ఈ కేసులో ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేశామని, అల్లు అర్జున్ను కూడా రిమాండ్ చేశామని విచారణ సందర్భంగా జీపీ కోర్టుకు తెలిపారు. అల్లు అర్జున్‌కు క్వాష్ కానీ, బెయిల్ కానీ ఇవ్వొద్దని జీపీ వాదనలు వినిపించారు. అరెస్ట్ తర్వాత్ క్వాష్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. హీరో, హీరోయిన్లను థియేటర్‌కు పిలవొద్దని యాజమాన్యానికి పోలీసులు లేఖ రాసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టు తీర్పు వచ్చాకే నాంపల్లి కోర్టు రిమాండ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read..
Breking News | అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..?
Allu Arjun | అల్లు అర్జున్ను విడుదల చేయాలి.. మృతురాలు రేవతి భర్త
Allu Arjun – Varun Dhawan | అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్