యువనటుడు హవీష్ కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. కావ్య థాపర్ కథానాయిక. హర్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి పతాకంపై నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. హూందాగా, ఉద్వేగంగా ఈ పోస్టర్లో హవీష్ కనిపిస్తున్నారు. చక్కగా దువ్విన జుట్టు, ట్రిమ్ చేసిన గడ్డం, కళ్లజోడు అతనికి ఓ సీరియస్ లుక్‌ని ఇచ్చాయి.
టక్ చేసిన షర్ట్, ఐడీ కార్డు, భుజంపై వేలాడుతున్న ఆఫీస్బ్యాగ్.. ఇవన్నీ ఇందులో తను ఓ మిడిల్ క్లాస్ మ్యాన్ అని చెబుతున్నవి. వాణిజ్య అంశాల మేలుకలయికలా ఈ సినిమా ఉంటుందని, హైదరాబాద్‌లో సుదీర్ఘమైన భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా రీసెంట్గా పాండిచ్చేరిలో హీరోహీరోయిన్లపై ఓ పాటను కూడా కంప్లీట్ చేసుకున్నదని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు.
బ్రహ్మానందం, శ్రీలక్ష్మీ, వెన్నెల కిశోర్, మురళీశర్మ, వీటీవీ గణేశ్, గోపరాజు రమణ, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: మిక్కీ జె.మేయర్.