ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హత్య’. శ్రీవిద్యా బసవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం నటుడు రవివర్మ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఓ హత్యా రహస్యం ఛేదనలో చోటుచేసుకునే పరిణామాలు ఉత్కంఠను పంచుతాయి.
రెగ్యులర్ మర్డరీ మిస్టరీ థ్రిల్లర్స్‌కు భిన్నంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అభిరాజ్ రాజేంద్రన్ నాయర్, సంగీతం: నరేష్ కుమారన్, రచన-దర్శకత్వం: శ్రీవిద్యా బసవా.