టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో శివ కందుకూరి (Shiva Kandukuri) లీడ్ రోల్ చేస్తున్న తాజా చిత్రం మను చరిత్ర (Manu Charitra). కోలీవుడ్ భామ మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా మరో పాటను విడుదల చేశారు మేకర్స్. హఠాత్తుగా (Hatatthuga) పాటను రాంగోపాల్ వర్మ రిలీజ్ చేశారు. ప్రేమలో పడటం బాధాకరమైన ఆనందం ట్యాగ్‌తో మొదలైన పాట..హఠాత్తుగా గుండె పిండినట్టుందే..హఠాత్తుగా నా ప్రాణమే ఆవిరైపోయిందే..నా నుంచి నేను పోయా అంటూ స్లో మోషన్లో సాగుతుంది.
సిరాశ్రీ రాసిన ఈ పాటను రేవంత్ పాడాడు. గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇప్పటికే విడుదలైన ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్లా (Ekkada Untadhiro Aa Pilla), హమేషా హమేషా (Hamesha Hamesha Song) పాటలు మంచి వ్యూస్ రాబడుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. కొత్త డైరెక్టర్ భరత్ పెదగాని టీజర్‌తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాడు.
ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీ వాత్సవ కీ రోల్స్ పోషిస్తున్నారు. ప్రొద్దుటూరు టాకీస్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై ఎన్ శ్రీనివాసరెడ్డి మనుచరిత్రను నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్