లండన్ : ఇంగ్లండ్ యువ బ్యాటర్, ఆ జట్టు భావి సారథిగా బావిస్తున్న హ్యారీ బ్రూక్ వరుసగా రెండో ఏడాదీ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. మరో రెండు వారాల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వాల్సి ఉండగా ఆదివారం అతడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. ‘వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలగాలని నేను కఠిన నిర్ణయం తీసుకున్నాను. ఇందుకు గాను ఫ్రాంచైజీతో పాటు అభిమానులను క్షమాపణ కోరుతున్నాను’ అని బ్రూక్ రాసుకొచ్చాడు. 26 ఏండ్ల బ్రూక్‌ను 2024 ఎడిషన్‌కు ముందు జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు దక్కించుకుంది. ఆ సీజన్లోనూ అతడు ఆడలేదు. తాజాగా తప్పుకుంటున్నందుకు గాను బీసీసీఐ అతడిపై కఠిన చర్యలకు దిగే అవకాశముంది.