Harom Hara | టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించగా.. మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా సుధీర్‌బాబుకు మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ తెలుగు ఓటీటీ వేదికలు ‘ఈటీవీ విన్’తో పాటు ‘ఆహా’ (Aha)లో నేటి నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఈ మూవీలో మాళవిక, సునీల్ రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలక పాత్రల్లో కనిపించారు.
A perfect picture for @isudheerbabu ..And Pakka entertainment picture for your weekend 😉
Premiers JULY 11 on @etvwin#HaromHara#EtvWin #WinThoWinodam pic.twitter.com/20XDmurL94— ETV Win (@etvwin) July 9, 2024
Also Read..