Jupiter 125 CNG | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘బజాజ్ ఆటో’.. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ మోటారు సైకిల్ ‘ఫ్రీడమ్ 125’ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించి ఇతర టూ వీలర్స్ తయారీ సంస్థలకు చాలెంజ్ విసిరింది. ఇంకా సేల్స్ ప్రారంభించకున్నా ఫ్రీడమ్ 125 బైక్కు మాత్రం దేశీయ టూ వీలర్స్ మార్కెట్లో, ఇంటర్నెట్లో పాజిటివ్ ప్రచారం హోరెత్తుతోంది. ఇది టూ వీలర్స్ తయారీ సంస్థల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తోంది. బజాజ్ ఆటో బాటలోనే మరో టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ పయనిస్తోందని వార్తలొచ్చాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ.. సీఎన్జీ పవర్డ్ జూపిటర్-125 ఆవిష్కరణకు కసరత్తు చేస్తుందని ఆ వార్తల సమాచారం. అదే నిజమైతే ప్రపంచంలోకెల్లా తొలిసారి మార్కెట్లోకి వచ్చిన తొలి సీఎన్జీ స్కూటర్ కానున్నది. ఈ సీఎన్జీ స్కూటర్ తోపాటు ఫిటెడ్ సీఎన్జీ కిట్ కూడా ఉంటుంది.
టీవీఎస్ మోటార్స్ కంపెనీ కొన్నేండ్లుగా పలు ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంపైనే ఫోకస్ చేసిందని సమాచారం. ఇప్పటికే సీఎన్జీ ఆప్షన్ టూ వీలర్ అభివృద్ధి చేసిందని ఆ వార్తా కథనాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో 125సీసీ సీఎన్జీ స్కూటర్ ను టీవీఎస్ ఆవిష్కరిస్తుందని సమాచారం. నెలకు 1000 యూనిట్ల సీఎన్జీ స్కూటర్లు విక్రయించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నది. అంతే కాదు టీవీఎస్ మోటార్స్ కంపెనీ పలు రకాల ఆప్షన్లతో టూ వీలర్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పెట్రోల్ తోపాటు ఫుల్లీ ఎలక్ట్రిక్, పెట్రోల్ తోపాటు సీఎన్జీ పవర్డ్ స్కూటర్ల తయారీకి ప్రయత్నిస్తున్నది.
బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 మోటారు సైకిల్ మాదిరిగానే టీవీఎస్ జూపిటర్ 125 సీసీ సీఎన్జీ స్కూటర్ కూడా సీఎన్జీ ఫ్యుయల్ ట్యాంకుతోపాటు సంప్రదాయ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. అయితే సీఎన్జీ ట్యాంకును స్కూటర్ లో అమర్చడం టీవీఎస్ ముందు ఉన్న అతి పెద్ద సవాల్ కానున్నది.సమాచారం. బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 మోటారు సైకిల్ ఒక కిలో సీఎన్జీతో 102 కి.మీ మైలేజీ ఇవ్వడంతోపాటు రూ.95 వేల నుంచి రూ.1.10 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతోంది. జూపిటర్ 125సీసీ సీఎన్జీ స్కూటర్ ధర అదే స్థాయిలో ఉండొచ్చునని భావిస్తున్నారు.