Harom Hara | టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించగా.. మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా సుధీర్‌బాబుకు మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇదిలావుంటే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి విడుదల చేసింది.
మొదట ఈ సినిమాను జూలై 11న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుగు ఓటీటీ వేదికలు ‘ఈటీవీ విన్’తో పాటు ‘ఆహా’ (Aha) ప్రకటించాయి. కానీ ఈ విడుదల తేదీని వాయిదా వేస్తూ జూలై 18వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపాయి. అయితే కారణం ఏంటో తెలిదు కానీ.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతుంది.
1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా వచ్చింది. కుప్పం ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని పాలిస్తుంటారు తమ్మిరెడ్డి అతడి తమ్ముడు బసవరెడ్డి. కనిపించిన ప్రతి భూమిని కబ్జా చేయడం.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం.. తమకెదురొచ్చిన వారిని దారుణంగా హతమార్చడం చేస్తుంటారు. అయితే వీళ్లను ఎదురించలేక అక్కడి ప్రజలంతా భయపడి ఊరిని విడిచిపెట్టి వేరే ప్రాంతలకు వలస వెళుతుంటారు. అలాంటి ప్రాంతంలో పాలిటెక్నిక్ ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రహ్మణ్యం (సుధీర్‌బాబు). కాలేజీలో ఒక గోడవ వలన తన ఉద్యోగం కోల్పోతాడు. సరిగ్గా అదే సమయంలో తండ్రి చేసిన అప్పులు తీర్చే బాధ్యత సుబ్రహ్మణ్యంపై పడుతుంది. ఈ నేపథ్యంలో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నా సుబ్రహ్మణ్యం తుపాకులు తయారు చేసే బిజినెస్‌లోకి ఎంటర్ అవుతాడు. అయితే తాను తయారు చేసిన గన్ బిజినెస్.. ఒకరోజు తన తండ్రి ప్రాణం మీదకి వస్తుంది. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం ఏం చేశాడు అనేది స్టోరీ.
Hey… gather your squad and check out #HaromHara! Avaliable for streaming on @ahavideoIN pic.twitter.com/oAMvHWHA4F
— Sudheer Babu (@isudheerbabu) July 16, 2024
Also Read..
Balagam – Filmfare Awards | 2024 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. 8 కేటగిరీల్లో నామినేట్ అయిన ‘బలగం’