Harish shankar meets sai dharam tej | మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన పరిస్థితేంటి? అని యాక్సిడెంట్ తర్వాత అభిమానులు పడ్డ టెన్షన్‌కు దసరాతో తెరపడింది. తేజూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.. ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు.. దసరా రోజున ఇలా తేజూ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్‌తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మీ అందరి ప్రార్థనల వల్లే తేజూ ఆరోగ్యంగా ఉన్నాడంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్‌ను పలువురు సెలబ్రెటీలు కలుస్తున్నారు.
Met my brother @IamSaiDharamTej and had a wonderful talk … Happy to say that he is super fit and getting ready to conquer ..
— Harish Shankar .S (@harish2you) October 20, 2021
ఫుల్లీ & మళ్ళీ లోడెడ్ 👍👍👍 pic.twitter.com/rhpBvZ0PHb
ఇటీవల సాయి ధరమ్ తేజ్ ను ఇంటికి వెళ్లి దర్శకుడు హరీశ్ శంకర్ కలిశాడు. ఈ సందర్భంగా ఒక ఫొటోను పోస్టు చేశాడు. నా తమ్ముడు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు సూపర్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఫుల్లీ.. మళ్లీ లోడెడ్ అంటూ చేతిలో చేయి కలిపి ఉన్న ఫొటోను హరీశ్ శంకర్ పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ ఫొటో వైరల్‌గా మారింది. సాయి ధరమ్ తేజ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా వచ్చింది. కాగా.. ఈ నెల మొదటి వారంలో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదల సమయానికి సాయి ధరమ్ తేజ్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నాడు. దీంతో ఈ సినిమా ప్రచార బాధ్యతలను మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. రిపబ్లిక్ సినిమా టీజర్‌ను చిరంజీవి విడుదల చేయగా.. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.. అయినప్పటికీ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. సినిమా చివరలో హీరో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.. దీంతో బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sai Dharam Tej | సాయిధరమ్ తేజ్ షూటింగ్ లో పాల్గొనేది ఎప్పుడంటే..?
Tollywood: యువ హీరోలకి ఎందుకిలా జరుగుతుంది?
Republic | హీరో చచ్చిపోతే ఒప్పుకోరా.. రిపబ్లిక్ ఫలితం ఏం చెప్పింది..?
చిరంజీవి చేతికి గాయం.. కంగారు పడుతున్న అభిమానులు..
మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
మెగా మేనల్లుడు మూడో సినిమా కూడా మొదలు పెట్టేశాడుగా..!