చిరంజీవి చేతికి గాయం.. కంగారు పడుతున్న అభిమానులు..

Mega star chiranjeevi hand injured | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. మరో రెండు మూడు కథలు కూడా విన్నాడు. వాటిపై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నాడు మెగాస్టార్. ఇన్ని సినిమాలు చేయాలంటే ఫిజిక్ కూడా కాపాడుకోవాలి. అందుకే 66 ఏళ్ల వయసులో కుర్ర హీరోలు కూడా కుళ్ళుకునేలా ఉన్నాడు చిరంజీవి. ఆయనను చూసి వారెవా అంటున్నారు అభిమానులు. అంతగా మారిపోయాడు మెగాస్టార్. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన చిరంజీవి.. గాడ్ ఫాదర్ తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మీడియా ముందుకు వచ్చిన మెగాస్టార్ చేతికి కట్టుతో కనిపించాడు. చిరంజీవి చేతికి అయి గాయం చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. అయ్యయ్యో చిరంజీవి చేతికి ఏమైంది అంటూ వారు ఆరా తీస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకులు మొదలు పెట్టి.. 33 కోట్ల సొంత ఖర్చులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్లు పంపించాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇది కేవలం తన ఒక్కడి వల్ల అయ్యే పని కాదు.. అభిమానులు కూడా సహకరించారని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఈ మంచి పనికి సహకరించిన అభిమానులను తాజాగా అన్ని జిల్లాల నుంచి చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు పిలిపించుకున్నాడు మెగాస్టార్. అక్కడ చిరంజీవి వాళ్లపై పొగడ్తల వర్షం కురిపించాడు. అభిమానూలు లేకపోతే నేను ఒక్కడిని ఏమీ చేయలేను అని చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో చేతికి గాయంతో కనిపించాడు చిరంజీవి. చిరంజీవి చేతి గాయం గురించి అడిగితే ఇంటి దగ్గర జిమ్ చేస్తున్నప్పుడు చేయి బెనికింది అని మెగాస్టార్ సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఇది పెద్ద గాయం కాదని.. రెండు మూడు రోజుల్లో కట్టును తొలగిస్తారు అని చెప్పుకొచ్చాయి. దీని గురించి అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు అంటున్నారు.
గాడ్ ఫాదర్ తాజా షెడ్యూల్ మొన్న అక్టోబర్ 14న ముగిసింది. తదుపరి షెడ్యూల్ నవంబర్ 1న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఇదిలా ఉంటే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా ఓపెనింగ్ నవంబర్ 11న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. ఈ మధ్యే కుర్ర దర్శకుడు వెంకీ కుడుముల చెప్పిన కథ కూడా విన్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శివ బాలాజీ భార్యపై సీరియస్ అయిన మోహన్ బాబు.. కారణమిదే..!
చిరంజీవి సినిమా కోసం బ్రిట్నీ స్పియర్‌ని రంగంలోకి దించుతున్నారా..!
మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
Ravali: పెళ్లి సందడి వేడుకలో రవళిని చూసి షాకైన చిరంజీవి, వెంకటేష్
Maa elections | ఒక్క ఓటమితోనే మెగా ఫ్యామిలీ సత్తా తగ్గిపోతుందా..?
MAA elections ఎఫెక్ట్.. మెగా హీరోల బ్లాక్ లిస్ట్‌లో నరేశ్ సహా ఇతర నటులు !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

