MAA elections ఎఫెక్ట్.. మెగా హీరోల బ్లాక్ లిస్ట్‌లో నరేశ్ సహా ఇతర నటులు !

MAA elections | ఉదయం గొడవ పడినా రాత్రి మళ్లీ ఒకటి అయిపోయే భార్య భర్తల గొడవలు ఎలా ఉంటాయి.. ఇండస్ట్రీలోని కొన్ని వివాదాలు కూడా అలాగే ఉండాలి. ఎంత పెద్ద గొడవ జరిగినా మళ్లీ కలిసి నటించాలి కాబట్టి వాళ్లు పెద్దగా పట్టించుకోరని అనుకుంటారు బయట ఆడియన్స్. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు మనసులో పెట్టుకోరు అనుకుంటారు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్ మాత్రం చాలా భిన్నం. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల కంటే సీరియస్‌గా జరిగాయి. నరేశ్, నాగబాబు సహా చాలామంది ఘాటుగానే విమర్శలు చేసుకున్నారు. సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని విధంగా గొడవలు జరిగాయి. అలాగే ప్రలోభాలు కూడా పెట్టారు. తనకు ఓటు వేస్తే మీకు కావాల్సింది ఇస్తాననే స్థాయిలో ప్రలోభ పెట్టారంటూ మంచు విష్ణు వర్గంపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇదంతా ఇలా ఉంటే ఎన్నికల సమయంలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య యుద్ధం జరిగింది అంటూ సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలో కూడా ప్రచారం జరిగింది. దీనిపై మెగా హీరోలు పెద్దగా స్పందించడం లేదు. కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవి, మోహన్ బాబు మధ్య యుద్ధం అని ఎలా డిసైడ్ చేస్తారు.. ప్రకాశ్ రాజ్ మంచి చేయాలని వచ్చాడు.. అందుకే సపోర్ట్ చేశాను.. ఆయన మాకు చుట్టం కాదు.. ప్రకాశ్ రాజ్ ఓడిపోతే చిరంజీవి ఓడిపోయినట్లు కాదు అని క్లారిటీ ఇచ్చాడు. ఎన్నికల సమయంలో భవిష్యత్తు గురించి మర్చిపోయి కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడారు.

మరీ ముఖ్యంగా మెగా హీరోలపై కూడా నోరు పారేసుకున్నారు. అందులో సీనియర్ నటుడు నరేశ్ ఉన్నాడు. తను కృష్ణుడు, మిగిలిన వాళ్లు పాండవులు అంటూ ఎన్నికల సమయంలో కామెంట్ చేశాడు నరేశ్. ఈ క్రమంలోనే మెగా హీరోలపై కూడా నోరు జారాడు నరేశ్. దాంతో నువ్వు కృష్ణుడు కాదు శకుని అంటూ నాగబాబు కౌంటర్ వేశాడు. నరేశ్ మాటలను చిరంజీవి సహా మిగిలిన అందరూ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై మెగా హీరోలు నటించే సినిమాలో నరేశ్ కనిపించడని.. అతనికి అవకాశాలు రావు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రమే కాదు పోసాని కృష్ణ మురళి సైతం మెగా హీరోల సినిమాలలో నిషేధించబడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Maa elections | ఒక్క ఓటమితోనే మెగా ఫ్యామిలీ సత్తా తగ్గిపోతుందా..?
Prakash Raj | పోలింగ్ రోజు సీసీ ఫుటేజి ఇవ్వండి.. ‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ!
ముక్కలైపోతున్న మా అసోసియేషన్.. సో కాల్డ్ సినీ పెద్దలేం చేస్తున్నారో..?
Allu Arjun | ‘మా’ ఎన్నికలకు అల్లు అర్జున్ డుమ్మా..కారణమిదే..!
కాను కానంటూనే సినీ పెద్దవుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు !
mega family | మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

