కాను కానంటూనే సినీ పెద్దవుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు !

mohan babu | ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా ఇదే అనుకుంటున్నారు. తనకు అవసరం లేదు అంటూనే మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన మాటల్లో అది కనిపించడం లేదు కానీ చేతల్లో మాత్రం కచ్చితంగా కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. మరీ ముఖ్యంగా మొన్న మా ఎన్నికలు పూర్తయిన తర్వాత మోహన్ బాబు మారిపోయాడు అంటూ అతనితో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నవాళ్లే మీడియా ముందుకు వచ్చి చెప్పారు. 40 ఏళ్లుగా స్నేహంగా ఉన్న తనను బూతులు తిట్టాడు అంటూ మీడియా ముందుకొచ్చి సీనియర్ నటుడు బెనర్జీ కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనంగా మారింది. మరోవైపు కుర్ర హీరో తనీశ్ కూడా ఇదే చెప్పాడు. ఇండస్ట్రీలో పెద్ద కావాలి అనుకున్నప్పుడు సామరస్యంగా ఉండాలి కానీ.. సమస్యలు కొన్ని తెచ్చుకునేలా ఉండకూడదు అంటూ మోహన్ బాబుకు కొందరు సలహాలు ఇస్తున్నారు. మరి వీటిని ఆయన ఎలా తీసుకుంటాడు అనేది ఆసక్తికరమే.
ఏదేమైనా కూడా ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువగా ఇండస్ట్రీ పెద్దల గురించి టాపిక్ బాగా నడుస్తుంది. అన్నింటికీ మించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేటప్పుడు సినీ పెద్దలు వెళ్తున్నారు అంటున్నారు. ఆ సినీ పెద్దలు ఎవరో తనకు తెలియదు అంటూ మోహన్ బాబు కామెంట్ చేశాడు. ఇప్పుడు ఆయనే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాలి అని చూస్తున్నాడు. ఈ క్రమంలో పెదరాయుడు తీర్పులు ఇవ్వాలని అనుకుంటున్నాడా అంటూ నాగబాబు లాంటి వాళ్లు ఈ విషయంపై సెటైర్లు కూడా వేశారు. మరోవైపు ఆయన పక్కన ఉండే కొంతమంది మోహన్ బాబును పదే పదే ఇండస్ట్రీ పెద్ద అంటూ చెప్తున్నారు. నరేశ్ అయితే మాటకు ముందు ఒక సారి.. వెనక ఒక సారి మోహన్ బాబును ఇండస్ట్రీ పెద్ద అంటున్నాడు. ఇవన్నీ ఆయన ప్రమేయం లేకుండా జరుగుతాయి అనడంలో అవివేకం తప్ప మరొకటి ఉండదు. కచ్చితంగా మోహన్ బాబు దృష్టిలో పడటానికి కొందరు ఇలాంటి నాటకాలు చేస్తున్నారు అంటున్నారు విశ్లేషకులు. మరి ఇది ఎటువైపు వెళ్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Benerjee | మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు: బెనర్జీ
Mohan Babu | నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు: మోహన్ బాబు
Mohan Babu: నిన్ను అందుకే కొన్నాళ్లు పక్కన పెట్టాను.. ఆలీతో మోహన్ బాబు
మోహన్ బాబును దొంగ నా కొడుకు అని తిట్టిన స్టార్ హీరో ఎవరు..?
Naga Babu: సోషల్ మీడియాలో రాజీనామా లేఖ.. నాగబాబు ఏయే విషయాలు చెప్పారంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- MAA
- mohan babu
- mohanbabu
- naga babu
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

