Benerjee | మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు: బెనర్జీ
'మా' ఎన్నికల పోలింగ్ సమయంలో తనపై జరిగిన దాడి గురించి నటుడు బెనర్జీ (Benerjee) ప్రెస్మీట్లో మాట్లాడారు. మోహన్ బాబు (Mohan Babu) తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘మా’ ఎన్నికల పోలింగ్ సమయంలో తనపై జరిగిన దాడి గురించి నటుడు బెనర్జీ (Benerjee) ప్రెస్మీట్లో మాట్లాడారు. మోహన్ బాబు (Mohan Babu) తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను దూరంగా నిలబడ్డాను. మోహన్ బాబు తనీష్ (Tanish) ను తిడుతున్నాడు. విష్ణు (Manchu Vishnu)దగ్గరకెళ్లి గొడవలొద్దు నాన్నా అని చెప్పా. వెంటనే మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చేశారు. విష్ణు బాబు నన్ను లాగేశాడు. నన్ను పచ్చి బూతులు తిట్టారని’ బెనర్జీ కంటతడి పెట్టుకున్నారు. ఆయన తీరుతో షాక్‌లో ఉండిపోయానన్నారు .
‘నేను 40 ఏండ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నా. మోహన్ బాబు నా ఇంట్లో మనిషి. నేను వాళ్లింట్లో మనిషిని. వందల మంది ముందుకు నన్ను అవమానపరిచారు. వందల మంది ముందు అలా చేసే సరికి చాలా బాధపడ్డాను. నా భార్య ఎంతో బాధపడింది. మంచు లక్ష్మి పుట్టినప్పటి నుంచి ఎత్తుకొని తిరిగానని’ ఆవేదనతో గుర్తు చేసుకున్నారు.ఈ విషయంపై మోహన్‌బాబు భార్య కూడా చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చారు బెనర్జీ. విష్ణు బాగా పనిచేస్తాడని నమ్ముతున్నా. రాజీనామా చేసిన తర్వాత తనకు భారం తగ్గిందని బెనర్జీ చెప్పారు.
ఆ తర్వాత తనీష్ మాట్లాడుతూ..మోహన్‌బాబు ఎందుకు తిట్టారో తనకు అర్థం కాలేదని అన్నాడు . మా అమ్మను కించపరిచేలా బూతులు తిట్టారు. ఈ భయానికి మా అభిప్రాయాలు చెప్పలేమోమోననిపిస్తోందని తనీష్ చెప్పాడు. తనను నమ్మి ఓటేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తనీష్ తెలిపాడు.
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
Ileana: ఇలియానా ఏంటి, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
Pushpa: పుష్ప నుండి శ్రీ వల్లి ప్రోమో సాంగ్ విడుదల
Esha Gupta: పైన మొత్తం విప్పేసి ఇలా రచ్చ చేస్తుందేంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- benerjee
- mohan babu
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

