Naga Babu: సోషల్ మీడియాలో రాజీనామా లేఖ.. నాగబాబు ఏయే విషయాలు చెప్పారంటే..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్,ఆయనకు సపోర్ట్‌గా నిలిచిన నాగబాబు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సెలవు అంటూ నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
తాజాగాతన రాజీనామాకి సంబంధించిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నిష్పక్షపాత, విభిన్నత కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీరును తాను ఎప్పుడూ అభిమానించేవాడని, సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని ‘మా’ ఒక సొంతిళ్లుగా నిలిచిందని నాగాబాబు అన్నారు. ఇటీవలి కాలంలో ‘మా’ సభ్యుల్లో అటు కళాకారులుగా ఇటు మనుషులుగా అనూహ్య మార్పులు వచ్చాయని, ఈ అసహ్యకరమైన మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయని వివరించారు.
ఈ ఎన్నికలు తన లాంటివారికి కనువిప్పు కలిగించాయని నాగబాబు తెలిపారు. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయారని ఆరోపించారు. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే అసోసియేషన్ నుంచి తాను వైదొలగలాని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గౌరవనీయులైన ప్రకాశ్ రాజ్ వెంట తాను ఎల్లప్పుడూ నిలబడే ఉంటారని నాగబాబు స్పష్టం చేశారు. తాను గత పరిణామాలపట్ల బాధపడటం లేదని, అసోసియేషన్ భవిష్యత్పైనే ఆందోళన చెందుతున్నట్టు వివరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

