A. M. Rathnam | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ జూన్ 12న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ నిర్మాత ఏఎం రత్నం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించారు. హరిహర వీరమల్లు టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోల అనుమతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఏఎం రత్నం కోరారు. ఈ మేరకు ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌ను కలిసి లేఖను సమర్పించారు. ఏపీ డిప్యూటీ సీఎం సూచనల మేరకు నిర్మాత ఫిల్మ్ చాంబర్‌ను సంప్రదించారు.
Read Also : OTT | ఈ వారం థియేటర్/ఓటీటీలలో అలరించే చిత్రాలేంటో తెలుసా?
ఇదిలా ఉండగా.. ఇటీవల థియేటర్ల మూసివేత వ్యవహారం విషయంలో పెద్ద రగడ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరల పెంపు కోసం వ్యక్తిగతంగా రావొద్దని స్పష్టం చేశారు. తన సినిమా టికెట్ల ధర పెంపు కోసమైనా ఫిల్మ్ చాంబర్ ద్వారానే రావాల్సిందేనన్నారు. అలా వస్తేనే సినిమా పరిశ్రమలో ఐక్యత పెరుగుతుందని.. హరిహర వీరమల్లు మూవీ అయినా సరే నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే రావాలన్నారు. ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే వచ్చి అర్జీ పెట్టి సంప్రదింపులు జరపాలని సూచించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ సమానమే. నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర మండలి ద్వారా వస్తేనే అందరికీ సమ న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి బేధాలు చూపించలేదన్నారు. టికెట్ల ధరల పెంపుపై కూడా పునరాలోచన చేస్తామని.. ఎలా పడితే అలా కాకుండా నిర్దిష్ట స్థాయిలోనే ధరలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత ఏఎం రత్నం ఫిల్మ్ ఛాంబర్‌ని ఆశ్రయించారు.
Read Also : Kamal Haasan | కన్నడ భాషపై వివాదం.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్
పవన్ కల్యాణ్ హీరోగా చారిత్రక నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా హరిహర వీరమల్లు మూవీని తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా రానుండగా.. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి పార్ట్ ఈ నెల 12 విడుదల కానున్నది. ఇప్పటికే మూవీకి సంబంధించిన పాటలు విడుదలవగా.. భారీ స్పందన లభిస్తున్నది. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు మూవీపై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్నది. బాబీ డియోల్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.