OTT | జూన్ మొదటి వారంలో ప్రేక్షకులని అలరించేందుకు మంచి చిత్రాలు రెడీగా ఉన్నాయి. భారీ తారాగణంతో రూపొందిన పాన్-ఇండియా చిత్రాలు నుంచి, యువ నటులతో వస్తున్న చిన్న చిత్రాలు వరకూ జూన్ మొదటి వారంలో విడుదల కానున్నాయి. ముందుగా థియేటర్లో విడుదల కానున్న సినిమాలేంటనేది చూస్తే.. ముందుగా కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం డైరెక్ట్ చేసిన చిత్రం థగ్ లైఫ్. ఈ మూవీ జూన్ 5వ తేదీన తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు నార్నె నితిన్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ 2022లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్నప్పటికీ, ఎట్టకేలకు జూన్ 6న విడుదలకి సిద్ధమైంది.
అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్ ముఖ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘హౌస్ ఫుల్ 5’ మూవీ జూన్ 6న విడుదల కానుంది. మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’ మూవీ కూడా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేశ్ చింతల, విద్యాసాగర్ కాదంపురి, మురళీ ధర్ గౌడ్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘బద్మాషులు’ మూవీ కూడా జూన్ 6న థియేటర్లలో విడుదల కానుంది. మొత్తానికి ఈ వారం థియేటర్స్లో విడుదల కానున్న సినిమాల పోటీ ఆసక్తికరంగానే ఉంటుంది.
ఇక ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఏంటనేది చూస్తే.. నెట్ ఫ్లిక్స్ లో వన్ ఆఫ్ దెమ్ డేస్ (హాలీవుడ్) – జూన్ 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జాబ్ (హిందీ) – జూన్ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ లో స్టోలెన్ (హిందీ) – జూన్ 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్స్టార్ లో టూరిస్ట్ ఫ్యామిలీ (తమిళ/తెలుగు) – జూన్ 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. గజానా (హిందీ) – జూన్ 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుండగా, దేవికా అండ్ డానీ (తెలుగు సిరీస్) – జూన్ 06వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.