Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. హరిహరవీరమల్లు పార్ట్-1 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ థర్డ్ సింగిల్ అసుర హననం లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ మూవీ నుంచి అసుర హననం లిరికల్ వీడియో సాంగ్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఒక యోధుడు పైకి వస్తాడు. ఒక వారసత్వం ప్రారంభమవుతుంది. ధర్మం కోసం యుద్ధం ప్రారంభం కానుంది.. అంటూ విడుదల చేసిన ఈ పాట గూస్బంప్స్ తెప్పిస్తూ హరిహరవీరమల్లు పోరు ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తుంది.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్నారు.
అసుర హననం లిరికల్ వీడియో సాంగ్..
Raashi Khanna | సినిమాలంటే ఆసక్తి లేదట.. తన రూంమేట్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన రాశీఖన్నా
Ruchi Gujjar | మోదీ నెక్లెస్‌తో కేన్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ భామ.. అందరి చూపు ఆమె వైపే
Thug life | ముంబైలో కమల్‌హాసన్, శింబు థగ్‌లైఫ్ టీం.. ట్రెండింగ్‌లో స్టిల్స్