Mahesh Babu – Superstar Krishna | తెలుగు చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటులలో నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. టాలీవుడ్‌కి యాక్షన్ జానర్‌తో పాటు మాస్ జానర్‌ని పరిచయం చేసింది కృష్ణ అని చెప్పకతప్పదు. తన కెరీర్లో దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించి, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. తెలుగు సినిమాకు అనేక సాహసోపేతమైన ప్రయోగాలను పరిచయం చేసిన ఘనత ఆయనది. భారత ప్రభుత్వం 2009లో ఆయనకు ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2022 నవంబర్ 15న ఆయన కన్నుమూసినా, ఆయన జ్ఞాపకాలు.. సినీ వారసత్వం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ఇదిలావుంటే సుపర్‌స్టార్ 82వ జయంతి నేడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా కృష్ణ కొడుకు మహేశ్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకోస్తూ.. ఎల్లప్పుడూ మీ వెలుగులోనే నడుస్తున్నాను. “హ్యాపీ బర్త్‌డే నాన్న. ఈ రోజుతో పాటు ప్రతి రోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను. అంటూ మహేశ్ బాబు రాసుకోచ్చాడు.
Always guided by your light… Happy birthday Nanna! Thinking of you today and every day ♥️♥️♥️ pic.twitter.com/riPa9Om7xc
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2025
మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా తన మామగారిని గుర్తు చేసుకుంటూ ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. కృష్ణ గారి దయ, బలం, జ్ఞానాలను ప్రస్తావిస్తూ, ఆ గొప్ప లక్షణాలు తమ కుటుంబాన్ని ప్రతి రోజు నడిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కృష్ణ మనుమరాలు మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని కూడా తన తాతగారితో ఉన్న ఒక పాత ఫోటోను పంచుకుని, మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు అని రాసుకోచ్చింది.
Read More