Making of HanuMan| ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్లలో హనుమాన్ ఒకటి. జాంబీ రెడ్డి, అ.! చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఈ సినిమాలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించాడు. 2024 జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.300 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది.
ఇక ఇదే సినిమాకు ముగింపులో సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ అనే టైటిల్‌తో రానుంది. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న స్టోరీతో ఈ సినిమా రానుండగా.. 2025లో ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే తాజాగా హనుమాన్ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో సినిమా కోసం ప్రశాంత్ వర్మ పడిన కష్టం, తేజ సజ్జా చేసిన విన్యాసాలు మూవీకే హైలైట్‌గా నిలిచాయి.
ALso read..