క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అ! సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా, ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ దక్కేలా వినూత్నంగా తెరకెక్కించాడు. ఇక రాజశేఖర్ ప్రధాన పాత్రలో కల్కి అనే చిత్రాన్ని తెరకెక్కించగా, ఇది కూడా కొత్త కథాంశంతో ప్రేక్షకులని అలరించింది. ఇటీవలె తేజ సజ్జాను హీరోగా పరిచయం చేశారు. జాంబీ రెడ్డితో తొలిసారిగా సౌత్‌లో జాంబీ జోనర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రం వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా సత్తా చాటింది.
ఇక ఈ రోజు ప్రశాంత్ వర్మ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన నాలుగో సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు. హనుమాన్ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుండగా, తెలుగులో ఇదే మొట్టమొదటి ఒరిజినల్ సూపర్ హీరో తెలుగు ఫిలిం అని ప్రశాంత్ వర్మ టీమ్ ప్రకటించింది. పురాణేతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ మూవీకి సంబంధించిన టీజర్లో నేపథ్య సంగీతం దైవిక అనుభూతిని కలిగించింది. కథానాయకుడు సహా ప్రాజెక్ట్ తారాగణం ఇతర సిబ్బంది వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.