Hansika | దేశముదురు సినిమాతో ఎంట్రీలోనే సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది హన్సికా మోత్వానీ (Hansika) . ఆ తర్వాత తెలుగులో లీడింగ్ స్టార్ హీరోలతో నటించి సూపర్ ఫేం కొట్టేసింది. తెలుగు, తమిళ భాషల్లో కోట్లాదిమంది అభిమానులున్న ఈ భామ ఓ వైపు గ్లామరస్ పాత్రల్లో కనిపిస్తూనే.. మరోవైపు హార్రర్ సినిమాలు కూడా చేస్తుందని తెలిసిందే.
ఈ భామ నటించిన హార్రర్ జోనర్ సినిమా శ్రీగాంధారి (SriGandhari). ఆర్ కన్నన్ దర్శకత్వం వహించాడు. ఒక రాజు నిర్మించిన శతాబ్ధాల నాటి గంధర్వ కోటలో ఉన్న రహస్యాలను ఎలా బయటకు తీసుకువచ్చారనే నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హన్సిక హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ చిత్రాన్ని తెలుగులో లచ్చురం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సరస్వతి డెవలపర్స్‌తో కలిసి రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. శ్రీగాంధారిలో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్, ఆడుకాలం నరేన్, స్టంట్ సిల్వా, వినోదిని, పవన్, బ్రిగిడా సాగా, వడివేల్ మురుగన్, కలైరాణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీగాంధారి ట్రైలర్..
Gear up for an unforgettable horror-thriller experience! 👻#SriGandhari starring @ihansika is coming to theatres in December 🍿🎥
The trailer is already making waves 🌊. Watch it again! 🔥👇
🔗 https://t.co/GBn7nb9tPn@Dir_kannanR @Masalapix #RajuNayak#LachhuramProductions… pic.twitter.com/MRxDgeMdDA
— BA Raju’s Team (@baraju_SuperHit) November 27, 2024
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Suriya 45 | సూర్య 45 పూజా సెర్మనీ టైం.. షూటింగ్ మొదలయ్యేది ఇక్కడే..!
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు