My name is shruti Teaser | హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. ది హిడెన్ ట్రూత్ అనేది ఉపశీర్షిక. ఆర్గాన్ మాఫియా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సస్పెన్స్ ఎంక్వైరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించాడు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్ర టీజర్ బుధవారం విడుదలైంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర టీజర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంఛ్ చేశారు.
అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో టాలెంట్ పెరిగిపోయింది. నటీనటులుగా, టెక్నీషియన్లుగా అవకాశాల కోసం ఎంతోమంది చిత్రపరిశ్రమలో తిరుగుతున్నారు. వారంతా సినిమాల్లోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనాతో దెబ్బతిన్న సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందని అన్నారు. అఖండ, పుష్ప సినిమాలు వచ్చాక చిత్ర పరిశ్రమ కోలుకుంటుందని.. కొత్త సినిమాలు వస్తున్నాయని అన్నారు. చిత్ర పరిశ్రమ పుంజుకోవాలనే సినిమా టికెట్ల రేట్లను పెంచామని తెలిపారు. చిన్న సినిమాలను దృష్టిలో ఉంచుకుని రోజువారీ షోలను నాలుగు నుంచి ఐదుకు పెంచామని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సినిమా ఇండస్ట్రీని దేశంలోనే ఒక హబ్‌గా ఉండాలన్నది తమ ఆకాంక్ష అని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ప్రేమ దేశం సినిమాకు రౌడీ బాయ్స్ సినిమాకు సంబంధం ఉందా?.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
Keerthy Suresh |టాలీవుడ్‌ను వదలని కరోనా.. కీర్తి సురేశ్‌కు పాజిటివ్
మళ్లీ ప్రేమలో పడ్డ శ్రుతి హాసన్.. తానే ప్రపోజ్ చేశానంటూ ఓపెన్ అయిన నటి