మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. ఆరంభంలో కాస్త మందగమనంలో సాగిన షూటింగ్‌ను తాజా షెడ్యూల్స్‌లో పరుగులు పెట్టిస్తున్నారని తెలిసింది. అనుకున్న సమయం కంటే ముందుగానే చిత్రీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఉందని చెబుతున్నారు.
తాజా షెడ్యూల్ ఇరవై రోజుల పాటు నాన్‌స్టాప్‌గా జరుగుతుందని సమాచారం. యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్‌బాబు సరికొత్తగా మాస్ అవతారంలో కనిపిస్తారని, ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నది. తమన్ సంగీతాన్నందిస్తున్నారు.