Suriya | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని తమిళ నటుడు సూర్య కొనియాడారు. ఆయన నటించిన తాజా చిత్రం ఈటీ ఈ నెల 10 వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కోసం సూర్య గురువారం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ వెస్ట్ ఇన్ హైదరాబాద్ హోటల్లో సూర్యను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ మర్యాదపూర్వకంగా కలిసి.. వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించాడు. అనంతరం ఆ పుస్తకం విశేషాలను సూర్యకు వివరించారు. కాగా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించిన రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోశ్ కుమార్కు సూర్య అభినందనలు తెలిపారు.