‘ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్ లేకుండా, కేవలం మౌత్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని అందుకున్నది మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. థియేటర్లలో క్రౌడ్ కూడా పెరుగుతోంది. ఈ చిన్న సినిమాను ఎంకరైజ్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.’ అని హీరో తిరువీర్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా బ్లాక్‌బస్టర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. టీనా శ్రావ్య కథానాయిక. ఈ కామెడీ ఎంటర్టైనర్కి రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు.
సందీప్ అగరం, అష్మిత రెడ్డి నిర్మాతలు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ ఫన్ షోలో హీరో తిరువీర్ పై విధంగా మాట్లాడారు. అతిథిగా విచ్చేసిన రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి ఈ సినిమా విజయం పట్ల హర్షం వెలిబుచ్చారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘థియేటర్లలో ఈ సినిమా ఆడుతుందో లేదో అనే డౌట్ ఉండేది. కలెక్షన్లు చూశాక నా అనుమానం పటాపంచలైపోయింది. థియేట్రికల్‌గా కూడా ఆడియన్స్ ఈ సినిమాను పెద్ద హిట్ చేశారు. సహజత్వంతో కూడిన కథల్ని చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడతారని ఈ సినిమా నిరూపించింది.’ అని చెప్పారు. ఇంకా నిర్మాత సందీప్ ఆగరం, హీరోయిన్ టీనా శ్రావ్య, చిత్రబృందం మాట్లాడారు.