మెగాస్టార్ చిరంజీవి కరోనా కష్టకాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఆక్సిజన్ బ్యాంకులని స్థాపించి ఎందరో ప్రాణాలు కాపాడుతున్న చిరు,మరోవైపు సినీ కార్మికులకు ఉచిత వ్యాక్సినేషన్ అందించి అందరివాడు అనిపించుకున్నారు. ఇక సోమవారం రోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తాన్ని దానం చేస్తున్న అందరికీ.. మరీ ముఖ్యంగా నా బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి థ్యాంక్స్. వారంతా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతారు. ఇలా ఎంతో చిన్న పనితో కొందరి విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. రక్తాన్ని దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి అని చిరంజీవి పిలుపునిచ్చారు.
చిరు పోస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళి సై స్పందిస్తూ.. మీ సేవలు అనిర్వచనీయమైనవి. ప్రాణవాయివు అందిస్తూ ప్రాణదాతగా మీరు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి, రక్తదాతలు ప్రాణాన్ని కాపాడేవారంటూ చిరంజీవి సేవా కార్యక్రమాలని తమిళిసై ప్రశంసించారు. గవర్నర్ ట్వీట్‌కు స్పందించిన చిరు.. మీ మాటలు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసేలా ఉన్నాయ్ మేడమ్. మీ ప్రశంసలు నన్ను ఇంకా ఎంతో కష్ట పడేలా చేస్తున్నాయి.అలానే మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు ఉత్సాహాన్నిస్తున్నాయి. థ్యాంక్యూ మేడమ్ అంటూ చిరు రిప్లై ఇచ్చారు.
Thank you for your kind, encouraging words Madam Governor @DrTamilisaiGuv
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2021
Your appreciation energizes me to work harder and serve the needy even better.
Extremely grateful to you!
Thank you once again!@Chiranjeevi_CT @AlwaysRamcharan https://t.co/CSgUahns2w