Godzilla x Kong | హాలీవుడ్ నుంచి వచ్చిన గాడ్జిల్లా చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజువల్ వండర్ గా తెరకెక్కే ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాలను అందుకోవడమే కాదు.. భారీ వసూళ్లను కూడా రాబడుతూ రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుంటాయి. మాన్స్టర్ యూనివర్స్‌లో భాగంగా ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ నుంచి 4 సినిమాలు రాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే రీసెంట్గా ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ (Godzilla x Kong The New Empire).
ఆడమ్ విన్ గార్డ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 12 2024న ఇంగ్లీష్‌తో పాటు, తమిళ్, హిందీ, తెలుగు తదితర భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో సినిమాలో ఆగష్టు 29 నుంచి ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ మరియు మరాఠీ భాషలలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జియో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
When survival is at stake, even the fiercest rivals must unite.
Godzilla x Kong: The New Empire, streaming August 29 onwards, exclusively on JioCinema Premium.
Available in English, Hindi, Tamil, Telugu, Kannada, Bengali and Marathi.
Subscribe to JioCinema Premium at Rs.29 per… pic.twitter.com/QzkpKUkUVL
— JioCinema (@JioCinema) August 26, 2024
ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్ ఎలా చెక్పెట్టిందనే కథాంశంతో ఈ చిత్రం రాగా.. ఈ చిత్రంలో రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కైలీ హాట్ల్, అలెక్స్ ఫెర్న్స్, ఫాలా చెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Also read..