టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్లో వస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కీ రోల్ చేస్తున్నాడు. చిరు 153వ చిత్రంగా వస్తున్న గాడ్ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్ డేట్ అందించారు మేకర్స్. జులై 4న సాయంత్రం 5:45న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. గూస్ బంప్స్ తెప్పించే గాడ్ ఫాదర్ రాక కోసం మార్గం వేయండి..అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
హనుమాన్ జంక్షన్ ఫేం మోహన్ రాజా డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే చిరంజీవితో కలిసి దిగిన స్టిల్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్.
చిరంజీవి దీంతోపాటు మెహర్ రమేశ్ డైరెక్షన్లో వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్లో 154వ ప్రాజెక్టును చేస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది ఈ ప్రాజెక్టు.
Make way for the MEGA Menacing Arrival of the #GodFather 🔥🔥
First look on 4th July at 5:45 PM 😎#GodFatherFirstLook 💥💥
Mega🌟 @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @AlwaysRamCharan #RBChoudary @ProducerNVP @KonidelaPro @SuperGoodFilms_ pic.twitter.com/Ao7472vzs1
— Konidela Pro Company (@KonidelaPro) July 1, 2022
Read Also : Pavitra lokesh | నరేశ్ మంచి వ్యక్తి..మీడియాతో పవిత్రా లోకేశ్..తెరపైకి మూడో భార్య..!
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!