టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తోన్న తాజా చిత్రం జిన్నా (Ginna). ఇషాన్ సూర్య (Ishan Surya) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), బాలీవుడ్ భామ సన్నీలియోన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ పోస్టర్లకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ టీజర్ అప్డేట్ ఇచ్చాడు మంచు విష్ణు.
మోడ్రన్ పొట్టి డ్రెస్‌లో సన్నీలియోన్, లంగావోణిలో పాయల్ రాజ్‌పుత్ ఉండగా..వీరిద్దరి మధ్యలో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు విష్ణు. జిన్నా టీజర్ సెప్టెంబర్ 9న విడుదల కాబోతుంది. మా క్రేజీ రైడ్‌ను మీకు చూపించేందుకు చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నానంటూ క్యాప్షన్ ఇచ్చాడు విష్ణు. ఈ పోస్టర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
సన్నీలియోన్ ఈ చిత్రంలో రేణుక పాత్రలో మెరువబోతుంది. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించడంతోపాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా..హోం బ్యానర్ ఏవీఏ ఎంటర్టైన్మెంట్ (AVA Entertainment)పై మంచు విష్ణు తెరకెక్కిస్తున్నాడు. జిన్నా చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్.
The madness unleashes soon 💯
Get ready for a whirlwind of adventure, thrill and entertainment as #Ginna arrives soon ⏳
Teaser coming on 9th September 💯@iVishnuManchu @starlingpayal @konavenkat99 @anuprubens @eeshaansuryaah #PremRakshith #ChotaKNaidu @Mee_Sunil pic.twitter.com/qnQvlKcuTs
— Sunny Leone (@SunnyLeone) September 7, 2022