అమరగాయకుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఘంటసాల జీవిత చరిత్ర ‘ఘంటసాల ది గ్రేట్’ పేరుతో వెండితెర దృశ్యమానమవుతున్నది. సి.హెచ్.రామారావు దర్శకుడు. ఈ నెల 12న విడుదలకానుంది. ఇందులో కృష్ణచైతన్య ఘంటసాలగా నటించారు.
ఘంటసాల జీవితంలోని ముఖ్యఘట్టాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, ఇటీవల లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో వేసిన ప్రత్యేక ప్రివ్యూలకు అద్భుతమైన స్పందన లభించిందని దర్శకుడు తెలిపారు. ఘంటసాల ఔన్నత్యాన్ని చాటిచెప్పే చిత్రమిదని, ఈ నెల 5న హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తామని మేకర్స్ పేర్కొన్నారు.