Genelia | బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. తెలుగు, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం జెనీలియా వయసు 37 సంవత్సరాలు కాగా, ఇప్పటికీ ఆమె యంగ్ లుక్‌లోనే కనిపిస్తుంటుంది.. ఆమె ఫిట్నెస్ పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉంది. పోషకాలు అధికంగా ఉండే ఆహారం.. కొవ్వు తక్కువగా ఉండి, పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటూ ఉంటుందట జెనీలియా. ఈ అమ్ముడు బొమ్మరిల్లు చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. ఇప్పుడు సినిమాలు పెద్దగా చేయడం లేదు కాని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తూనే ఉంది. అయితే తాజాగా జెనీలియా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది.
జెనీలియా..రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమ వివాహం చేసుకోగా, ఆ జంటకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జెనీలియా తన ఇద్దరు కొడుకులతో అప్పుడప్పుడు సరదాగా షికార్లకి వెళుతుంటుంది. అయితే తాజాగా జెనీలియా తన కుమారులతో బయటకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లడానికి కారు ఎక్కుతుంది. ఆ సమయంలో డ్రైవర్ తొందరపాటుతో కాస్త ముందుకు పోనిచ్చాడు. లోపల ఉన్నవారు అరవడంతో కారుని ఆపేశారు. అయితే కారు వేగంగా వెళ్లి ఉంటే జెనీలియాకి పెను ప్రమాదమే జరిగి ఉండేది. కారు కింద పడి గాయలు అయ్యేవి అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమెకి పలువురు జాగ్రత్తలు చెబుతున్నారు.
జెనీలియా హీరోయిన్గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే రితేష్ ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత మళ్లీ ప్రధాన పాత్రలలో సినిమాలు చేయలేదు కాని సపోర్టింగ్ రోల్స్‌లో అడపాదడపా కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. 2020లో వచ్చిన ఇట్స్ మై లైఫ్ అనే హిందీ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన ఈ భామ 2022లో మజిలీ సినిమా రీమేక్ ‘ వేద్’లో నటించింది. తెలుగులో కూడా ఓ సినిమా చేసింది. ప్రస్తుతం జెనీలియా నటిగానే కాకుండా ప్రొడక్షన్ పనులు కూడా చూసుకుంటుంది.