రిలీజ్ డేట్‌కు షరతులు వర్తిస్తాయి!
‘ఈ సినిమా కాన్సెప్ట్‌తో పాటు టీజర్ నాకు బాగా నచ్చింది. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే కథ ఇది. ప్రపంచవ్యాప్తంగా మా ఎస్వీసి సంస్థ ద్వారా విడుదల చేయబోతున్నాం’ అన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. తరుణ్‌భాస్కర్ హీరోగా నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘ఈ సినిమా కాన్సెప్ట్‌తో పాటు టీజర్ నాకు బాగా నచ్చింది. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే కథ ఇది. ప్రపంచవ్యాప్తంగా మా ఎస్వీసి సంస్థ ద్వారా విడుదల చేయబోతున్నాం’ అన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. తరుణ్‌భాస్కర్ హీరోగా నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. సోమవారం రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
రిలీజ్ డేట్ విషయంలో షరతులు వర్తిస్తాయని, ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా విడుదల ఉన్నందున ‘గాయపడ్డ సింహం’ రిలీజ్ డేట్‌ను మార్చుకునే వీలుందని, అవసరం అనుకుంటే ఓ వారం రోజులు వెనక్కి జరుపుకునే అవకాశం ఉందని దిల్ రాజు తెలిపారు. దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం తమకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని, ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయని, వాటిని వరుసగా రివీల్ చేస్తామని చిత్ర సమర్పకుడు పవన్ సాదినేని అన్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్ అగస్తీ, నిర్మాతలు: కల్యాణ చక్రవర్తి, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్, రచన-దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

