రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon). విలక్షణ కథలతో ఎప్పటికపుడు ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తుంటాడు స్టార్ హీరో విక్రమ్. ఈ ఇద్దరూ ఒక్క దగ్గర చేరితే ఎలా ఉంటుంది. ఇపుడలాంటి స్టిల్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. గౌతమ్ మీనన్ నెక్ట్స్ చిత్రం వెంధు థనింధతు కాదు (Vendhu Thanindhathu Kaadu) సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో విక్రమ్‌ను కలిసినపుడు తీసిన స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు గౌతమ్ మీనన్ . నక్షత్రాలు కలిసిపోతాయి.. అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు. విక్రమ్ అప్ కమింగ్ చిత్రం ధ్రువ నక్షత్రం(Dhruva Natchathiram)సినిమాను గుర్తు చేస్తూ..పెట్టిన ఈ పోస్ట్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తాజా స్టిల్‌తో ఈ యాక్టర్ అండ్ డైరెక్టర్ త్వరలోనే మరో రిలీజ్ అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు అభిమానులు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.