Mammootty | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి – ‘ఏం మాయ చేసావే’, ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ చిత్రాల ఫేమ్ తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) కాంబోలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రోడక్షన్.06 గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ గత బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభంకాగా.. మమ్ముట్టి సోంత నిర్మాణంలో ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో కథానాయికగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సమంతను మేకర్స్ కలిసినట్లు సమాచారం. కాగా దీనిపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత ఇంతకుముందు ‘ఏం మాయ చేసావే’, ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాల్లో నటించింది. సమంత ఈ మూవీ కూడా ఒకే చెప్పితే హ్యాట్రిక్ కాంబో అవుతుంది. కాగా.. ఈ సినిమాపై మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
మెగాస్టార్ మమ్ముట్టి ఈ ఏడాది ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాది కాథల్ ది కోర్ అంటూ బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ ఈ ఏడాది భ్రమయుగం, టర్బో సినిమాలతో మంచి విజయాలను ఖాతాలో వేసుకున్నాడు.
Also Read..