అగ్ర నటులు అరవింద్‌స్వామి, విజయ్ సేతుపతి, అదితి రావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటించిన మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’ ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతున్నది. జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ బెలేకర్ దర్శకుడు. శనివారం విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇండియన్ సినిమాలో అరుదైన సైలెంట్ ఫిల్మ్ ఇది. ఈ కథను వివరించడానికి మాటల కంటే నిశ్శబ్దం బలమైన అంశంగా అనిపిస్తుంది.
లోతైన భావోద్వేగాలతో సాగే ఈ కథలో అరవింద్‌స్వామి, విజయ్ సేతుపతి అద్భుతాభినయం ప్రదర్శించారు. ఏ.ఆర్.రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ కథకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. సినిమా సంప్రదాయాలను సవాలు చేస్తూ, కొత్తదనంతో, సృజనాత్మక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాం. నిశ్శబ్దం ద్వారా గొప్ప భావోద్వేగాల్ని కలిగించే చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’ అని దర్శకుడు తెలిపారు.
Read Also :
Amitabh Bachchan | 25 ఏళ్ల కేబీసీ ప్రయాణం… గ్రాండ్ ఫినాలేలో భావోద్వేగానికి లోనైన అమితాబ్ బచ్చన్
Mandaadi | సుహాస్, సూరి అడ్వెంచరెస్ యాక్షన్ సీక్వెన్స్.. హైప్ పెంచుతోన్న మండాడి పోస్టర్లు