Ganapath Movie | రాప్‌తో రఫ్ఫాడించిన టైగర్ ష్రాఫ్.. ‘గణపథ్’ నుంచి కొత్త ప్రోమో
Ganapath Movie | బాలీవుడ్లో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు టైగర్ ష్రాఫ్(Tiger Shroff). జాకీ ష్రాఫ్ తనయుడిగా తెరంగేట్రం చేసిన టైగర్ ష్రాఫ్ ఆకట్టుకునే డ్యాన్స్, నటనతోపాటు తన శరీర సౌష్టవంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
Ganapath Movie | బాలీవుడ్లో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు టైగర్ ష్రాఫ్(Tiger Shroff). జాకీ ష్రాఫ్ తనయుడిగా తెరంగేట్రం చేసిన టైగర్ ష్రాఫ్ ఆకట్టుకునే డ్యాన్స్, నటనతోపాటు తన శరీర సౌష్టవంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటిస్తున్న చిత్రం గణపథ్ (Ganapath). ఏ హీరో ఇస్ బార్న్(A Hero Is Born) అనేది ఉపశీర్షిక కృతిసనన్ (Kriti Sanon) ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి వికాస్‌భల్ (Vikas Bhal) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా రిలీజ్ ప్రోమో విడుదల చేశారు.
ఫ్యూచరిస్టిక్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ప్రోమోతో చిన్న క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రెహమాన్, జమీల్ ఖాన్, గిరీష్ కులకర్ణి, శ్రుతి మీనన్, జియాద్ బక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుడ్ కో, పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
AMITABH BACHCHAN – TIGER SHROFF – KRITI SANON: ‘GANAPATH’ NEW PROMO OUT NOW… 20 OCT RELEASE… Ahead of its theatrical release on 20 Oct 2023, Team #Ganapath: A Hero Is Born – starring #AmitabhBachchan, #TigerShroff and #KritiSanon – unleashes a special promo: World of #Ganapath.… pic.twitter.com/DPYRV7l5So
— taran adarsh (@taran_adarsh) October 18, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

