Ram Charan | ‘శంకర్‌గారితో పనిచేయడం నిజంగా అదృష్టం. మా కోసం లక్నో వరకూ వచ్చిన అభిమానులకు థ్యాంక్స్. అందరి అంచనాలను మించి ‘గేమ్‌చేంజర్’ ఉంటుంది.’ అని రామ్‌చరణ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌చేంజర్’. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని శనివారం లక్నోలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ పై విధంగా మాట్లాడారు. ‘మా సంస్థ నుంచి వస్తున్న 50వ చిత్రం ఇది. శంకర్‌గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్.
దానికితోడు రామ్‌చరణ్ కూడా తోడవ్వడం మరింత ఆనందంగా ఉంది.’ అని దిల్‌రాజు చెప్పారు. ఇంకా కియారా అద్వానీ, అంజలి, ఎస్.జె.సూర్య కూడా మాట్లాడారు. ఇదిలావుంటే శనివారం విడుదలైన టీజర్ అభిమానుల్ని అలరించేలా ఉంది. పొలిటికల్ యాక్షన్ ఎంటైర్టెనర్‌గా ఈ సినిమా రూపొందినట్టు టీజర్ చెబుతున్నది. ‘ఐయామ్ అన్‌ప్రెడిక్టబుల్..’ అంటూ రామ్‌చరణ్ ైస్టెలిష్‌గా చెప్పిన డైలాగ్‌తో ఈ టీజర్ ముగిసింది. రామ్‌చరణ్ నటనతోపాటు సంభాషణలు, సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.