‘నేను ఇప్పటివరకూ రియలిస్టిక్, నేచురల్ సినిమాలే చేశా. ‘గం గం గణేశా’లో తొలిసారి ఎనర్జిటిక్ కేరక్టర్‌తో వస్తున్నా. ఇది టిపికల్ జోనర్. క్రైమ్, కామెడీ నేపథ్యంతో కూడిన కథ. ఎక్స్‌ప్రెస్‌రాజా, రన్‌రాజారన్, స్వామిరారా, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ.. ఈ తరహా సినిమాలు చూసిన ఫీల్ కలుగుతుంది. నా ప్రీవియస్ మూవీ ‘బేబీ’తో అస్సలు పోలికుండదు. అందరి మంచి కోరుకునే మనసున్న వ్యక్తి మా దర్శకుడు ఉదయ్.
ఈ సినిమా ఆయనకే కాదు, టీమ్ మొత్తానికి పెద్ద బ్రేక్‌గా నిలుస్తుంది’ అని ఆనంద్ దేవరకొండ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘గం గం గణేశా’ ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సాయిరాజేశ్ అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇంకా యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కరిష్మ, వెన్నెల కిశోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమ్మాన్యూయేల్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఆదిత్య జవ్వాడి, సంగీతం: చేతన్ భరద్వాజ్.