‘కిరీటి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. కిరీటీ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అతని రూపంలో ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ హీరో దొరికాడు’ అన్నారు కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్. ఆదివారం బెంగళూరులో జరిగిన ‘జూనియర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.
రజనీ కొర్రపాటి నిర్మాత. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా మన ఇంట్లో జరిగే కథలా ఉంటుందని, హార్ట్‌టచింగ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుందని చెప్పారు. మంచి కథతో పాటు విజువల్‌గా కూడా ఈ సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని హీరో కిరీటి రెడ్డి అన్నారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లిద్దరూ నెక్ట్స్ లెవల్ పర్ఫార్మెన్స్ కనబరిచారని జెనీలియా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రవిచంద్రన్, శ్రీలీల, సెంథిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.