స్వచ్ఛంద సేవాసంస్థ ‘మనం సైతం ఫౌండేషన్’ స్థాపించి 12ఏండ్లు పూర్తయిన సందర్భంగా మనం సైతం ఫౌండేషన్ పుష్కర మహోత్సవాన్ని హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. పలువురు చలనచిత్ర, రాజకీయ, మీడియా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాను సీనియర్ జర్నలిస్ట్ జి.కృష్ణ శిష్యుడనని, తాను చేస్తున్న సామాజిక సేవకు స్ఫూర్తి ఆయనేనని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ అన్నారు.
12ఏండ్లుగా జరుగుతున్న ఈ సేవాయజ్ఞానికి ఎందరో మహానుభావులు మద్దతుగా నిలిచారని, ఈ సేవాకార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు. ఇంకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలాచారి, సినీనిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, కాజా సూర్యనారాయణరావులతోపాటు పలువురు జర్నలిస్టులు కూడా మాట్లాడారు.