Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace)లో పంజాబీ సంప్రదాయంలో ఆదివారం ఘనంగా జరిగింది. బంధుమిత్రులు, స్నేహితుల సమక్ష్యంలో రాఘవ్ తన ప్రేయసి పరిణీతి మెడలో మూడుముళ్లు వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలను కొత్త జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు రాఘవ్-పరిణీతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థ వేడుక ఢిల్లీలోని రాజీవ్ చౌక్‌లో గల కపుర్తాల హౌస్‌లో మే 13వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చాలారోజులు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. ఓ హోటల్ డిన్నర్ డేట్‌కు వచ్చిన సమయంలో ఇద్దరు ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా చదివారు. కామన్ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగి.. అది కాస్త ప్రేమగా మారింది. చివరకు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.
Parineet Chopra Raghav Chadha#saadi #Udaipur #video #twitter #RajasthanNews #raghavchaddha #ParineetiRaghavWedding pic.twitter.com/ooiR4QxQcj
— Bhakti aesthetics.. (@Archana02037284) September 25, 2023
Also Read..
Hero Karthi | అమ్మలేని ఇల్లు బోసిపోతున్నది.. వదిన జ్యోతిక గురించి హీరో కార్తీ ఎమోషనల్ పోస్ట్