Hero Karthi | అమ్మలేని ఇల్లు బోసిపోతున్నది.. వదిన జ్యోతిక గురించి హీరో కార్తీ ఎమోషనల్ పోస్ట్
హీరో కార్తీ తన వదిన జ్యోతిక గురించి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నది. వారి కుటుంబంలోని ఆప్యాయతలకు అద్దంపట్టేలా ఉంది ఆ పోస్ట్. వివరాల్లోకెళ్తే, సీనియర్ తమిళహీరో శివకుమార్ తనయులుగా తెరంగేట్రం చేసిన సూర్య, కార్తీ ప్రస్తుతం స్టార్హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. విశేషమేంటంటే వారిది మొన్నటివరకూ ఉమ్మడి కుటుంబం.
Hero Karthi | హీరో కార్తీ తన వదిన జ్యోతిక గురించి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నది. వారి కుటుంబంలోని ఆప్యాయతలకు అద్దంపట్టేలా ఉంది ఆ పోస్ట్. వివరాల్లోకెళ్తే, సీనియర్ తమిళహీరో శివకుమార్ తనయులుగా తెరంగేట్రం చేసిన సూర్య, కార్తీ ప్రస్తుతం స్టార్హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. విశేషమేంటంటే వారిది మొన్నటివరకూ ఉమ్మడి కుటుంబం. అయితే ఈ మధ్య ఎందుకో సూర్య, జ్యోతిక తమ పిల్లలతో ముంబయిలో సెటిల్ అయ్యారు. షూటింగ్‌లు ఎక్కువగా చెన్నయ్‌లోనే ఉండటం చేత సూర్య అటూఇటూ తిరుగుతున్నారని సమాచారం.
అయితే, ఈ విషయంపై కార్తీ తన వ్యక్తిగత సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “ అమ్మలేని ఇల్లు బోసి పోతున్నది. నేను ఆమెను వదినగా ఎప్పుడూ చూడలేదు అమ్మగానే చూశాను. తను కూడా తన పిల్లల్లో నన్నూ ఒకడిగా చూసుకుంది. ఇప్పుడు అమ్మ ఇల్లు వదిలి ముంబయ్‌లో ఉండటం బాధగా ఉంది. అమ్మలేని ఇంట్లో ఉండటం నా వల్ల కావటం లేదు. ఇన్నాళ్లూ ఈ ఇల్లు ఉమ్మడికుటుంబంలా కలిసిమెలిసి ఉందంటే కారణం అమ్మే. అందరం కలిసి ఉన్న ఆ రోజులు గుర్తొస్తే గుండె బరువెక్కుతోంది. అన్నయ్య పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. పిల్లల చదువులకోసం మాత్రమే వాళ్లు ముంబయి వెళ్లారు. ప్రస్తుతానికైతే పండగలకు కలుస్తుంటాం. మళ్లీ అందరం కలిసుండే రోజు కోసం ఎదురుచూస్తున్నా.” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు కార్తీ. అభిమానులనే కాదు, అందర్నీ కదిలించేలా ఉంది ఈ పోస్ట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Hero Karthi
- Jyothika
- surya
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

