Raghav-Parineeti Wedding | పంజాబ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లితో ఒకటికాబోతున్నారు. ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో ఏడు అడుగులు వేయనున్నారు. అయితే, రాయల్ వెడ్డింగ్‌కు ముందే పంజాబ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. శిరోమణి అకాలీదల్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాఘవ్ చద్దా వివాహ వేడుకకు పంజాబ్ పోలీసులను వినియోగించుకున్నారని ఆరోపించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు చెందిన వందలాది మంది భద్రతా సిబ్బందితో పాటు బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్లు పెళ్లికి మోహరించారని ఎంపీ విమర్శించారు.
గత 18నెలల్లో పంజాబ్ తీసుకున్న రూ.50వేలకోట్ల విలువైన రుణాలను ఆప్ ప్రభుత్వం ఎక్కడ ఖర్చు చేసిందని పంజాబ్ గవర్నర్ అడగడంలో ఆశ్చర్యం లేదన్నారు. ఇదిలా ఉండగా.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ వేడుకలకు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, సీరియర్ హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు పలువురు ప్రముఖులు ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. పెళ్లి కోసం ప్యాలెస్‌ను అలంకరించారు. శనివారం పలు కార్యక్రమాలు జరుగ్గా.. ఇరుకుటుంబాలు పాల్గొన్నాయి. అతిథులకు లంచ్‌ను ఏర్పాటు చేయగా.. రాత్రికి 90s థీమ్ పార్టీని సైతం ఏర్పాటు చేశారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ పార్టీని చండీగఢ్, ఢిల్లీలో నిర్వహించనున్నారు.
Wedding of @ArvindKejriwal blue eyed boy @raghav_chadha but at his service is CM @BhagwantMann‘s hundreds of security men, bullet proof land cruisers etc ! Waah ..!! No wonder Punjab Governer is rightfully asking where Punjab’s Rs. 50,000 crores worth of loans taken in last 18… pic.twitter.com/9cOovALrtV
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) September 23, 2023