Devara Movie | దేవర సినిమా కోసం అవేంజర్స్, ఓపెన్ హైమర్ సినిమాల టెక్నీషియన్లు.. కొరటాల ఈ సారి భారీగా ప్లాన్ చేస్తున్నట్లున్నాడుగా..!
Devara Movie | ప్రస్తుతం ఎడతెరపు లేకుండా ఈ సినిమా షూటింగ్‌ను కొనసాగిస్తున్నారట. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూ్ల్స్ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ అదే స్పీడ్‌తో ముందుకు కదులుతున్నారు.
Devara Movie | ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మాములు అంచనాల్లేవు. దానికి తోడు మరో వైపు పలు లీకుల ప్రవాహంతో సినిమాపై అంతకంతకూ హైప్ పెరుగుతూనే ఉంది. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటివరకు మనం చూడని యాక్షన్ సీన్లను దేవర టీమ్ డిజైన్ చేస్తుందట. తారక్ సైతం వాటికోసం ప్రత్యేకించి శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఇక అండర్ వాటర్ సీన్ అయితే మరో అద్భుతమట. సిల్వర్ స్క్రీన్‌పై ఆ సన్నివేశం చూసినప్పుడు సీట్లలో ఒక్కరు కూడా కూర్చోరట. ఇలాంటి లీకులు నందమూరి అభిమానుల్లోనే కాదు సగటు ఆడియెన్స్‌లో సైతం అంతులేని అంచనాలు నెలకొల్పుతున్నాయి.
ప్రస్తుతం ఎడతెరపు లేకుండా ఈ సినిమా షూటింగ్‌ను కొనసాగిస్తున్నారట. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూ్ల్స్ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ అదే స్పీడ్‌తో ముందుకు కదులుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ అందరిలోనూ ఉత్కంఠ రేపేలా ఉంది. ఈ సినిమా కోసం ప్రపంచంలోని దిగ్గజ విజువల్ ఎఫెక్ట్ కంపెనీ అయిన ‘DNEG’ రంగంలోకి దిగిందట. గతంలో ఈ కంపెనీ అవేంజర్స్, ఓపెన్ హైమర్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఇన్ఫినిటీ వార్ వంటి దిగ్గజ సినిమాలకు పని చేసింది. ఇక ఇప్పుడు అలాంటి కంపెనీ దేవరకు పని చేస్తుందంటే విజువల్స్ ఏ రేంజ్లో ఉండబోతాయో అన్న ఊహే గూస్బంప్స్ తెప్పిస్తుంది.
సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. జాన్వీకి సంబంధించిన కీలక ఎపిసోడ్ షూట్ ఈ నెలాఖరులో మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తుందట. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవరతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

