War 2 | తెలుగుతోపాటు హిందీ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ వార్ 2 (War 2). అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కిన వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తారక్, హృతిక్ రోషన్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. కాగా ఇందులో విలన్ ఎవరనేది ఇప్పటికీ సస్పెన్స్‌గా ఉంది. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు మేకర్స్.
వార్ 2లో తారక్, హృతిక్ రోషన్‌లో ఇద్దరిలో ఒకరు నెగెటివ్ రోల్లో కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో విలన్ కూడా ఈ ఇద్దరిలో ఒకరై ఉంటారని అంతా అనుకున్నారు. అయితే మరో 3 రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో యశ్ రాజ్ ఫిలింస్ చాలా రోజుల సస్పెన్స్‌కు తెరదించింది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ ఉన్నాడు. ఇంతకీ అతడెవరనుకుంటున్నారా..? యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ సూపర్ స్టార్డమ్ కొట్టేసిన బాబీ డియోల్.
యశ్‌రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం థ్రిల్లింగ్‌గా ఉందన్నాడు బాబీ డియోల్. ప్రత్యేకించి ఇలాంటి ప్రాంఛైజీ ప్రాజెక్టులో తానెప్పుడూ నటించలేదని చెప్పాడు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తన పాత్రను పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెంటేషన్‌తో డిజైన్ చేశాడని అన్నాడు బాబీ డియోల్. తారక్, హృతిక్ రోషన్ పాత్రలు ఎమోషనల్ లింక్‌తో సాగుతూ సిల్వర్ స్క్రీన్‌పై చూస్తున్న ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తాయని మేకర్స్ స్పష్టం చేశారు.
స్పై యూనివర్స్‌లో వచ్చిన టైగర్ 3లో ఇమ్రాన్ హష్మీని విలన్‌గా చూపించిన మేకర్స్.. ఇప్పుడిక ఈ ప్రాంఛైజీలో వస్తున్న వార్ 2లో బాబీ డియోల్‌ను పెట్టి అంచనాలు భారీగా పెంచేస్తున్నారు. కియారా అద్వానీ గ్లామర్, తారక్, హృతిక్ రోషన్ యాక్షన్ పార్ట్, బాబీ డియోల్ పవర్ ఫుల్ ప్రజెంటేషన్ సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని ధీమాతో ఉన్నారు మూవీ లవర్స్.
Film Chamber | సాప్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు.. సినీ కార్మికుల నిరసనపై ప్రసన్న కుమార్
Madharaasi | శివకార్తికేయన్ నయా అవతార్.. మదరాసి మేకింగ్ వీడియో వైరల్
Baaghi 4 Teaser | టైగర్ ష్రాఫ్ ‘బాఘీ 4’ టీజర్ విడుదల