Madharaasi | కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి SK23. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో SKxARMగా వస్తోన్న ఈ మూవీ మదరాసి టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్‌తోపాటు టైటిల్ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఏఆర్ మురుగదాస్ టీం ఓ మేకింగ్ వీడియోను షేర్ చేసింది. శివకార్తికేయన్ ఈ సినిమాలో నయా అవతార్‌ను చూపించేందుకు ఎలా కష్టపడ్డాడో ఈ వీడియో హింట్ ఇచ్చేస్తోంది.
ఇక విద్యుత్ జమ్వాల్, మలయాళ నటుడు బిజూమీనన్తో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా ఉండబోతున్నాయని మేకింగ్ విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. మోస్ట్ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ మదరాసి 25 రోజుల్లో మీ ముందుకు రాబోతుందంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పాపులర్ మాలీవుడ్ యాక్టర్, అయ్యప్పనుమ్ కొషియుమ్ ఫేం బిజూమీనన్, బాలీవుడ్ స్టైలిష్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు.
.@Siva_Kartikeyan #Sivakarthikeyan’s #Madharaasi in 25 Days 🔥🔥 One Of The Most Promising & Powerful Project 🔥🔥 pic.twitter.com/6EazQufhur
— BA Raju’s Team (@baraju_SuperHit) August 11, 2025
Venkatesh Maha | మహేశ్ బాబు నిర్మాతగా.. సత్యదేవ్‌తో ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడి కొత్త సినిమా.!
Upasana | నేను తింటుంటే అందరు అదోలా చూశారు.. చిరంజీవి సలహాలని పాటించానన్న ఉపాసన
This Week Movies | కూలీ, వార్ 2.. ఈ వారం మూవీ లవర్స్‌కే పండగే.!