Upasana | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంటారు. ఫ్యామిలీని చూసుకుంటూ అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) వైస్ చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఉపాసన. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు కూడా పొందుతూ ఉంటుంది. ఇటీవలే తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు ఆమెను కో ఛైర్మన్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో చిరంజీవి, రామ్ చరణ్ చాలా సంతోషించారు.
ఉపాసన కొణిదెల ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత జీవితంతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. రీసెంట్గా ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ, పెళ్లి తర్వాత మెగా కుటుంబం సంప్రదాయాలపై తనకు ఎలా అవగాహన పెరిగిందో వివరించారు.సాధారణంగా చాలా మందికి పెరుగు చివర్లో తినే అలవాటు ఉంటుంది. కానీ నేను పెళ్లి తర్వాత తొలిసారి లంచ్‌కి అందరితో కలిసి కూర్చుని తినేటప్పుడు, మొదట పెరుగు వేసుకుని తినడం మొదలుపెట్టాను. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా నన్ను చూశారు. ‘అలా ఎలా తినగలుగుతున్నావ్?’ అని కూడా అడిగారు,” అని అప్పటి విషయాలని గుర్తు చేసుకుంది ఉపాసన.
మా మామయ్య (మెగాస్టార్ చిరంజీవి) పెరుగు చివర్లో తినాలి ఆరోగ్యపరంగా కూడా అది మంచిదని చెప్పారు. అప్పటి నుంచి నేను కూడా అదే పాటిస్తున్నాను అని తెలిపారు ఉపాసన.ప్రేమలో ఉన్నప్పుడు చరణ్ కు ఓ ప్రేమ పరీక్ష పెట్టినట్టు చెప్పుకొచ్చారు ఉపాసన. తాను నిజంగా తనని ప్రేమిస్తే హైదరాబాద్ లోని ఛార్మినార్ దగ్గర ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గరకు కి తీసుకెళ్లాలని ఓ పరీక్ష పెట్టగా, నిజంగానే తీసుకెళ్లాడు. అప్పుడు అందరు చరణ్‌ని గుర్తు పట్టి ఆయన మీద పడిపోయారు. ఇది నిజమైన లవ్ టెస్ట్ అని ఉపాసన పేర్కొంది. ఇక మాది మగధీర చిత్రంలో మాదిరి చేతులు తగలగానే షాక్ వచ్చే సినిమాటిక్ లవ్ స్టోరీ కాదు అని ఉపాసన పేర్కొంది.