This Week Movies | సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరో మూడు రోజుల్లో రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా కాగా.. మరోకటి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2. ఈ రెండు సినిమాలు ఇండిపెండెన్స్ డే కానుకగా.. ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విడుదలకు ఇంకా మూడు రోజులే ఉండడంతో భారీ ఎత్తున్న ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఒకవైపు కూలీ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనుండటం.. నాగర్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, వంటి అగ్ర తారలు నటిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే వార్ 2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించటం.. ఎన్టీఆర్ కూడా ఈ ఫ్రాంచైజీలో భాగం కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వీకెండ్ ఈ రెండు చిత్రాలే కాకుండా ఓటీటీలో కూడా పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. అవి ఏంటి అనేది చూసుకుంటే.!
థియేటర్
కూలీ (ఆగష్టు 14)
వార్ 2 (ఆగష్టు 14)
ఓటీటీ
అమెజాన్ ప్రైమ్
అంధేరా (హిందీ సిరీస్) ఆగస్టు 14
జియో హాట్స్టార్
సారే జహాసే అచ్చా (హిందీ మూవీ) ఆగస్టు 13
జీ5
టెహ్రాన్ (హిందీ చిత్రం)ఆగస్టు 14
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (మలయాళం) ఆగస్టు 15
సోనీలివ్
కోర్ట్ కచేరీ (హిందీ సిరీస్) ఆగస్టు 13
బుక్ మై షో
సర్ (హిందీ సిరీస్) ఆగస్టు 11
ఈటీవీ విన్
‘కానిస్టేబుల్ కనకం’ ఆగస్టు 14 (తెలుగు సిరీస్)